నల్గొండ ఎన్జీ కాలేజ్లో నేటి సాయంత్రం సీపీఐ శత వార్షికోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు జిల్లా నలుమూల నుంచి ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సోమవారం నల్గొండకు తరలొస్తున్నారు. దీంతో పట్టణమంతా ఎర్రజెండాలతో ఎరుపెక్కింది. కళాకారుల కోలాటాలు, విన్యాసాలు, డప్పు చప్పుళ్లతో నల్గొండ దద్దరిల్లింది.