నల్గొండ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నిడమనూరు మోడల్ స్కూల్లో విద్యార్థినుల పట్ల టీచర్ అసభ్యకరంగా ప్రవర్తించాడని తల్లిదండ్రులు ఆరోపించారు. తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఏడవ తరగతి విద్యార్థిని ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేసింది. శనివారం విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ ముందు ఆందోళనకు దిగారు.