సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంగళవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పెన పహాడ్ మండలం దోస పహాడ్ బిసి గురుకులాలో చనిపోయిన ఐదవ తరగతి విద్యార్థిని కొంపల్లి సరస్వతి మృతి పట్ల సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీవోకు కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనియాకుల శ్రీకాంత్ వర్మ మాట్లాడుతూ గురుకులాలు మరణ కేంద్రాలుగా మారుతున్నాయన్నారు.