తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14 న రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా వాసి అయినా మాల మహానాడు జిల్లా అధ్యక్షులు కందుల వీరబాబుకు అంబేద్కర్ జయంతి నిర్వహణ కమిటీ అధ్యక్షులు శ్యాంమ్ కుమార్ మరియు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి చేతుల మీదుగా దళిత రత్న అవార్డు ఇవ్వడం జరిగింది. అవార్డు తీసుకున్న సూర్యాపేట జిల్లా మాల మహానాడు అధ్యక్షులు కందుల వీరబాబు శనివారం మాట్లాడుతూ నేను సమాజంలో ప్రజలకు చేసిన సేవలను గుర్తించి నాకు ఈ అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. స్నేహితులు బంధువులు అందరూ అభినందిస్తూ మీరు ఇలాంటి మరెన్నో అవార్డులు తీసుకోవాలని జాతికి మరింత సేవలు అందించాలని కోరుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు రాజ కుమార్, రాష్ట్ర మాల మహానాడు మహిళా అధ్యక్షురాలు, మరియు దేవరకొండ డివిజన్ అధ్యక్షులు యేకుల సురేష్, కమల నరేష్ తదితరులు పాల్గొన్నారు.