సూర్యాపేట పట్టణం 4వ వార్డు కాశింపేట గ్రామంలో రంజాన్ పవిత్ర మాసమును పురస్కరించుకొని ముస్లింలకు గురువారం సాయంత్రం హిందువుల ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లింలకు రంజాన్ పవిత్ర మాసం ఎంతో పవిత్రమైనదని ఈ రంజాన్ సందర్భంగా ముస్లింలు ఉపవాసాలు ఉంటారన్నారు. వారికి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో అలిశెట్టి రాజు, లింగరాజు, సతీష్, గణేష్, నాగేందర్, నాగరాజ్, పందుల లింగయ్య, అలిశెట్టి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.