జిల్లా కేంద్రంలో శనివారం కేసారం రైతు వేదికలో లక్షలోపు రుణమాఫీ కానీ రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని మండల వ్యవసాయ అధికారి దినకర్ తెలిపారు. రైతు బీమా నమోదు చేసుకొని రైతులు ఆగస్టు 04 వరకు అవకాశం ఉందని ప్రతి ఒక్క రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి ముత్తయ్య, రైతులు ఎలుక సంతోష్, చైతన్య రెడ్డి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.