45 రోజులలో డబుల్ బెడ్ రూమ్ గృహాలలో అన్ని పనులు పూర్తి చేసి లబ్ధిదారులకి పంపిణి చేయుటకు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. శుక్రవారం సూర్యాపేట మండలం కేసారం వద్ద గల ఇందిరమ్మ ఫేజ్ 2 డబుల్ బెడ్ రూమ్ గృహాల సముదాయంని పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, డబుల్ బెడ్ రూమ్ గృహా సముదాయంలోని అన్ని గృహలకు కరెంట్, నీటి వసతి లాంటి అన్ని మౌళిక వసతులు పూర్తి చేయాలని అధికారులకి సూచించారు.