సర్వ మతాల పండుగలకు సమాన ప్రాధాన్యత ఉంటుందని పీసీసీ సభ్యులు పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో బుధవారం పలు చర్చిలో క్రిస్మస్ సంబరాల్లో వారు పాల్గొని మాట్లాడారు. అన్ని మతాల పండుగలను కలిసికట్టుగా జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగని అన్నారు. క్రీస్తు ప్రేమ, కరుణ, శాంతి, సుగుణాలను బోధించారని ఆయన బోధనలు ప్రపంచాన్ని ప్రభావితం చేశాయన్నారు.