సూర్యాపేట జిల్లా కేంద్రంలో బుధవారం క్రిస్మస్ సందర్భంగా జరిగిన వేడుకల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. పట్టణంలోని బర్లపెంట గ్రేస్ చర్చిలో పాస్టర్ యేసు రత్నం, పాస్టర్ సామెల్ కిరణ్ గ్రేస్, శాంతినగర్ సిలోయం చర్చిలో కొత్తపల్లి సిల్వి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో కేక్ కటింగ్ చేసి ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో పాల్గొని క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.