విజయవాడలో శ్రీశ్రీ కళావేదిక తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఫోరం, వరల్డ్ పోయెట్రీ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో సూర్యాపేటకు చెందిన కవి, రచయిత పోతుగంటి వీరాచారికి తెలుగు కీర్తి ప్రతిభా జాతీయ పురస్కారానికి ఎంపిక చేశారు. మంగళ వారం అవార్డు ను డాక్టర్ కత్తిమండ ప్రతాప్, కొల్లి రమావతి లు అందజేశారు. కాగా వీరాచారిని సాహితి మిత్రులు శివరాత్రి వెంకన్న , కాశీ నాగార్జున చారి తదితరులు అభినందించారు.