కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ప్రజలకు అనేక వాగ్దానాలు చేసిందని, వాటన్నింటిని వెంటనే అమలు చేయాలని సీపీఐ(ఎం. ఎల్) మాస్ లైన్ సూర్యాపేట డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ కొత్తపల్లి రేణుక శుక్రవారం డిమాండ్ చేశారు. ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అనేక రకాల వాగ్దానాలు చేసిందని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించిందన్నారు.