సూర్యాపేట పిల్లలమర్రి గ్రామంలో ఆదివారం రాత్రి కురిసిన వర్షాలకు ఈదురు గాలులతో పిల్లలమర్రి గ్రామానికి చెందిన చెరుకుపల్లి నరసయ్య మందారమ్మ, దాసరి పద్మ, చెరుకుపల్లి దేవయ్య, గడ్డమీది శేఖర్ రెడ్డి, వారి ఇంటి పైకప్పులు రాత్రి వచ్చిన ఈదురుగాలులకు ఎగిరిపోవడంతో ఆ ప్రదేశంను, పరిశీలించి, తక్షణమే అధికారులతో మాట్లాడినారు. అధికారులు స్పందించి, వెంటనే పరిశీలించి, ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం అని చెప్పారు. 12వ వార్డు కౌన్సిలర్ బచ్చలకు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం తరుపున బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు చెరుకుపల్లి శ్రీనివాస్, హరిబాబు, సూర్యపేట మండల పార్టీ ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు చెరుకుపల్లి చంద్రశేఖర్ మాదిగ, 10వ వార్డు టిఆర్ఎస్ నాయకులు చెరుకుపల్లి వెంకన్న, ఉపేందర్, రమేష్, గోపయ్య, ఈశ్వర్, చెరుకుపల్లి నరేష్, బంగారి, చెందుపట్ల వెంకటేష్, చెరుకుపల్లి గణేష్, ఇంద్రకంటి వెంకన్న, బురుగుల శరత్ కోనేటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.