సూర్యాపేట: ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉపాధ్యాయులకు సర్వే విధులు
ఉపాధ్యాయులకు కుల గణన సర్వే విధులు, ప్రాధమిక పాఠశాలల నిర్వహణ తదితర అంశాలపై బుధవారం సూర్యాపేట జిల్లా విద్యాశాఖాధికారి కె అశోక్ తో TPUS జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పర్వతం సంధ్యారాణి, యామారమేశ్ లు చర్చించారు. ఈ సంధర్బంగా డిఈఓ అశోక్ మట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వే విధులు కేటాయించబడిన ఉపాధ్యాయులు నిర్వహించాలన్నారు. సర్వే విధులు లేని పాఠశాలలు రెండు పూటలా యధావిధిగా కొనసాగుతాయని తెలిపారు.