సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం వ్యాప్తంగా శుక్రవారం పెరిగిన ఉష్ణోగ్రతలతో వేడి వాతావరణం నెలకొంది. గత నాలుగు రోజులుగా పగటిపూట 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. విపరీతమైన వేడి ఉక్కపోతతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మద్దిరాల, నూతనకల్, తుంగతుర్తి, నాగారం, జాజిరెడ్డిగూడెం ప్రాంతాలలో అత్యధికంగా 35, 36 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.