సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరి బౌద్ధ స్థల ప్రదర్శనశాల పర్యాటకులతో సందడిగా మారింది. నేడు నూతన సంవత్సరం కావడంతో పర్యాటకులు ఫణిగిరి బౌద్ధ క్షేత్రానికి తరలివచ్చారు. ప్రదర్శనశాల సిబ్బంది కార్తీక్, వీరయ్య, యాకయ్య పర్యాటకులకు ప్రదర్శనశాలలోని శిల్పాలను వాటి ప్రాముఖ్యతను తెలియజేశారు. పర్యాటకులు వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో తరలివచ్చారు.