సూర్యాపేట జిల్లా తిరుమలగిరి జెడ్. పి. హెచ్. ఎస్ గెజిటెడ్ హెడ్మాస్టర్ దామెర శ్రీనివాస్ ను పలువురు అభినందించారు. ఏ స్టడీ ఆన్ జాబ్ సాటిస్ఫాక్షన్ అండ్ ప్రొఫెషనల్ పెర్ఫార్మన్స్ అమౌంట్ సెకండరీ స్కూల్ టీచర్స్ అనే అంశంపై చేసిన పరిశోధనా పత్రం మహారాష్ట్రకు చెందిన ప్రో. వినయ్ శంకర్ హేటల్ సంపాదకత్వంలోని రాయల్ ఇంటర్నేషనల్ మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ జర్నల్లో ప్రచురితమైంది. ఆయనను విద్యాశాఖ అధికారులు అభినందించారు.