సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల వ్యాప్తంగా దట్టమైన పొగ మంచు కమ్ముకుంది. ఉదయం 9 గంటల వరకు గత రెండు రోజులుగా దట్టమైన పొగ మంచు కురుస్తుంది. పొగ మంచు వల్ల రహదారులపై ప్రయాణించే వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. దట్టమైన పొగ మంచు వల్ల రహదారులపై ప్రయాణించే వాహనదారులు, ప్రయాణికులు జాగ్రత్త వహించాలని అధికారులు సూచిస్తున్నారు. దట్టమైన పొగ మంచుతో పాటు చలి తీవ్రతలు గణనీయంగా పెరిగాయి.