ప్రస్తుతం బంగ్లాదేశ్ ఆందోళనలతో అట్టుడుకుతోంది. దీంతో అక్టోబర్ 3 నుంచి 20 వరకు ఆ దేశంలో జరగాల్సిన మహిళల టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై నీలినీడలు అలముకున్నాయి. ఈ నేపథ్యంలో టోర్నమెంట్ వేదికను మార్చాలని ఐసీసీ భావిస్తోంది. ఇప్పటికే భద్రతా ఏజెన్సీలతో ఐసీసీ సంప్రదిస్తోంది. మరో వైపు టోర్నమెంట్‌ను భారత్‌లో ఐసీసీ నిర్వహించవచ్చనే ప్రచారం సాగుతోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.