నటుడు అల్లు అర్జున్ వివాదంపై తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై స్పందించారు. తెలంగాణలో సూపర్‌స్టార్ ఎవరనే విషయంలో అల్లు అర్జున్‌తో సీఎం రేవంత్ రెడ్డి పోటీపడేందుకు యత్నిస్తున్నారని విమర్శలు చేశారు. కాంగ్రెస్‌లోనూ సీఎం రేవంత్‌రెడ్డి నటిస్తున్నారని, తెలంగాణలో ప్రధాన నటుడు ఆయనేనని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం రాజకీయ ప్రేరేపితమైనదని, ఇందులో ఒకరిని బలిపశువును చేయడం, వేధించడం సరికాదన్న అన్నామలై పేర్కొన్నారు.