సౌర, పవన, గ్రీన్ హైడ్రోజన్‌పై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని సోమవారం శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పునరుత్పాదక ఇంధన వనరుల పెంపునకు క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చినట్లు తెలిపారు. 2030 నాటికి 20 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో సౌరఫలకాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.