ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ తన ఫ్లాగ్‌షిప్ ఎంపిక చేసిన మోడళ్లపై రూ.70వేల వరకు తగ్గింపును అందిస్తోంది. దీంతో పాటు రూ.1.4 లక్షల విలువైన ప్రయోజనాలనూ అందిస్తోంది. టాటా మోటార్స్ తాజా నిర్ణయంతో పాపులర్ ఏయూవీలైన హ్యారియర్ (రూ.14.99 లక్షలు), సఫారీ (రూ.15.49 లక్షలు) ధరలు దిగొచ్చాయి. వీటితో పాటు నెక్సాన్.ఈవీ పైనా రూ.1.3 లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తున్నట్లు టాటా మోటార్స్ ఓ ప్రకటనలో పేర్కొంది.