తెలంగాణలో కూడా టీడీపీ- జనసేన పొత్తు..?

50చూసినవారు
తెలంగాణలో కూడా టీడీపీ- జనసేన పొత్తు..?
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు మళ్లీ గద్దెనెక్కారు. ఇప్పుడు ఆయన తెలంగాణలో టీడీపీ బలోపేతంపై ఫోకస్ పెట్టారనే టాక్ వినిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పోటీకి దూరంగా టీడీపీ ఉండిపోయింది. అయితే ఏపీలో గెలుపు జోష్‌తో ఉన్న టీడీపీ తెలంగాణలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అదే జోష్‌తో పోటీ చేసేందుకు రెడీ అవుతోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఏపీలో బీజేపీ, జనసేనలతో జత కట్టడం టీడీపీకి కలిసొచ్చింది. తెలంగాణలో అదే విధంగా ఆ రెండు పార్టీలతో కలిసి ముందుకు సాగాలనే వ్యూహంతో చంద్రబాబు ఉన్నారట.

సంబంధిత పోస్ట్