వైద్యారోగ్యశాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తాం: మంత్రి సత్యకుమార్‌

71చూసినవారు
వైద్యారోగ్యశాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తాం: మంత్రి సత్యకుమార్‌
వైసీపీ పాలనలో వైద్యార్యోగశాఖను నీరుగార్చరని, నాడునేడు పేరిట భవనాలకు రంగులు వేసి అభివృద్ధి అని గొప్పలు చెప్పుకున్నారని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్‌ ఆరోపించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆరోగ్యశ్రీలో అనేక అవినీతి, అక్రమాలు జరిగాయని, ఎన్‌ప్యానెల్ లిస్ట్‌లో లేని ఆసుపత్రులను చేర్చారని అన్నారు. ఇటువంటి వాటిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్