తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మెగాస్టార్ చిరంజీవిని అభినందించారు. "యూకే పార్లమెంట్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్న కొణిదెల చిరంజీవికి హృదయపూర్వక అభినందనలు. మీకు లభించిన ఈ గౌరవం తెలుగు జాతికి గర్వకారణం. భవిష్యత్తులో మీరు మరిన్ని శిఖరాలను అధిరోహించాలని, తెలుగు ప్రజల కీర్తి ప్రతిష్ఠలను విశ్వవేదికపై చాటి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను." అని సీఎం రేవంత్ ఎక్స్ వేదికగా గురువారం ట్వీట్ చేశారు.