హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో పదో తరగతి టాపర్లకు ప్రతిభా పురస్కారాలను సీఎం రేవంత్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వందేమాతరం ఫాండేషన్‌ను అభినందించారు. ఇప్పుడు సర్వీసులో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్‌లలో 90 శాతం మంది ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివారని స్పష్టం చేశారు. చాలా రాష్ట్రాల సీఎంలు, మంత్రులు, కేంద్ర మంత్రులు కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివారని గుర్తు చేశారు. డీఎస్సీ ద్వారా త్వరలోనే టీచర్ పోస్టుల భర్తీ చేస్తామని సీఎం రేవంత్ అన్నారు.