TG: రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గంభీరావుపేటలోని కేజీటుపీజీ క్యాంపస్‌లో ఉపాధ్యాయుడు దేవరాజు ఒకటవ తరగతి విద్యార్థి లవన్ సాయి కుమార్‌పై శారీరక దాడి చేశాడు. అల్లరి చేశాడని వీపుపై కొట్టడంతో బాలుడికి తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో బాలుడిపైన గాయాలను గమనించిన తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లగా, ఉపాధ్యాయుడు అప్పటికే వెళ్లిపోయాడు. తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.