భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఆసియా కప్ లో వరుసగా 9వ సారి టీమిండియా ఫైనల్స్ కి అర్హత సాధించింది. దీంతో టోర్నీలో ప్రతిసారి ఫైనల్ కు చేరిన జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటివరకు 8 ఫైనల్స్ ఆడగా 7 సార్లు విజేతగా నిలిచింది. ఓసారి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. ఇప్పుడు మరోసారి తుదిపోరుకు సిద్ధమైంది.