టీంఇండియా ఈ ఏడాది ఆగస్ట్‌లో బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ ఏప్రిల్ 15న ప్రకటించింది. రెండు వేదికల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఆగస్ట్ 17న వన్డే సిరీస్.. 26న టీ20 సిరీస్ మొదలవుతాయి.ఈ పర్యటనలో భాగంగా టీమిండియా ఆగస్టు 17, 20, 23 తేదీల్లో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. అనంతరం ఆగస్టు 26, 29, 31 మూడు టీ20ల సిరీస్ టీమిండియా బంగ్లాతో ఆడనుంది.