బీట్ రూట్ సాగులో మెళకువలు

70చూసినవారు
బీట్ రూట్ సాగులో మెళకువలు
బీట్ రూట్ పంటను సాగు చేసే ముందు నేలను అదును వచ్చే వరకు బాగా దున్నాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 10-12 టన్నుల పశువుల ఎరువును వేసి కలియ దున్నాలి. అలాగే ఆఖరి దుక్కిలో ఎకరాకు 14 కి. నత్రజని, 44 కి. భాస్వరం, 14 కి. పొటాష్ వేసుకోవాలి. గింజ విత్తిన 25 రోజులకు ఎకరాకు 14 కి. నత్రజని, 14 కి. పొటాష్ వేసుకోవాలి. అలాగే గింజలు మొలకెత్తిన తర్వాత ఒక్కో గింజ బాల్ నుండి 2-6 మొలకలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒక బలమైన మొలక ఉంచి, మిగిలినవి పీకి వేయాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్