ఖరీఫ్ లో టమాటా నారు పెంపకంలో మెళుకువలు

54చూసినవారు
ఖరీఫ్ లో టమాటా నారు పెంపకంలో మెళుకువలు
ఖరీఫ్ లో జూన్ మొదటి పక్షం నుండి జూలై రెండవ పక్షం వరకు టమాటా సాగు చేసుకోవచ్చు. విత్తన సమయంలో ఒక కిలో విత్తనాలకు 3గ్రా.మెటాలాక్సిల్, 2 గం. తర్వాత 4గ్రా. ట్రైకోడెర్మా విరిడితో విత్తన శుద్ధి చేయాలి. ఆ తరువాత 5గ్రా.ఇమిడా క్లోప్రిడ్ ను విత్తనాలకు పట్టించాలి. పొలంలో సూర్యరశ్మి, గాలి బాగా వీచే ప్రాంతంలో నారుమడి చేసుకోవాలి. ఒక ఎకరం పంటకు 4 మీ పొడవు, ఒక మీటర్ వెడల్పు, 5 సెం.మీ. ఎత్తు ఉండే పది నారుమళ్లు చేసుకోవాలి. ఆ తర్వాత విత్తనాలను నారుమడిలో పలచగా చల్లుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్