తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఈటల?

70చూసినవారు
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఈటల?
తెలంగాణకు చెందిన కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కడంతో రాష్ట్ర పార్టీలో కూడా బీజేపీ జాతీయ నాయకత్వం కీలక మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. కిషన్‌రెడ్డి స్థానంలో పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు అమిత్‌షాను నేడు ఈటల రాజేందర్ కలిశారు. తాజా పరిణామాల నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్