తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. ఈనెల 11 నుంచి 14 వరకు తెలంగాణ రైతు మహోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అగ్రి హార్టికల్చర్ సొసైటీ ఆధ్వర్యంలో రైతు మేళా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రైతు మహోత్సవం బ్రోచర్‌ను కోదండరెడ్డి ఆవిష్కరించారు. తొలిరోజు రైతుమేళాను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించనున్నట్లు వారు తెలిపారు.