టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ దురోవ్ శనివారం రాత్రి ఫ్రాన్స్‌లో అరెస్టయ్యారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని బోర్గెట్ విమానాశ్రయంలో పోలీసులకు పట్టుబడ్డాడు. ఓ కేసులో ఆయన కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఈ విషయంపై టెలిగ్రామ్ ఇంకా స్పందించనప్పటికీ, ఆయనను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించినట్లు ఫ్రెంచ్ పోలీసులు తెలిపారు. ఈ అరెస్టు నేపథ్యంలో రష్యా బ్లాగర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.