తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి: CM రేవంత్

66చూసినవారు
తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి: CM రేవంత్
సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలసి తిరుమల శ్రీవారిని బుధవారం ఉదయం దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 'కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర రైతులు సంతోషంగా ఉన్నారు. రాష్ట్రంలో నీటి సమస్యలు తీరి సకాలంలో వర్షాలు కురిశాయి. ఏపీలో ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నా. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించాను. స్వామి వారి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి' అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్