గుడిలో గంటకు ఎంతో ప్రత్యేకత ఉంది. దేవాలయం చిన్నదైనా, పెద్దదైనా గంటను మాత్రం తప్పకుండా ఏర్పాటు చేస్తారు. అయితే, గంటను ఎందుకు మోగిస్తారు అంటే.. రాక్షస శక్తులు పోయి దైవ శక్తులు రావాలనే ఉద్దేశంతోనే గంట వాయిస్తారు. ఆలయంలో నందిని ముట్టుకోవడంలోనూ ఓ రహస్యం ఉంది. నంది వేద ధర్మ స్వరూపం కాబట్టి ముట్టుకుంటారు. నంది కొమ్ముల మధ్య నుంచి చూడటమంటే మనలోని పశుత్వాన్ని పొగొట్టుకుని దేవుడిని దర్శిస్తున్నామని అర్థం.