హైదరాబాద్ లోని ఎల్బీనగర్ పరిధి చైతన్యపురి సత్యనగర్ లో ఇళ్ల కూల్చివేతలపై నిరసనలు కొనసాగుతున్నాయి. దీంతో ఎప్పుడు ఏ ఇళ్లు కూలగొడతారేమోనని స్థానికులు భయంతో ఉంటున్నారు. ఈ మేరకు ఉద్యోగాలకు వెళ్లకుండా ఇళ్ల ముందే పడిగాపులు కాస్తున్నామని బాధితులు వాపోతున్నారు. వందల ఇళ్లు కూలగొట్టి తమను రోడ్డున పడేయొద్దని వారు అధికారులను వేడుకుంటున్నారు. సత్యనగర్ లో ఏ వీధిలో చూసినా ప్రజలు భయంతో బయటే కూర్చున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.