నల్గొండ జిల్లాలో టెన్త్ తెలుగు పేపర్ లీక్ కలకలం సృష్టించింది. నకిరేకల్‌లోని SLBC బాలుర గురుకులంలో ప్రశ్నాపత్రం ఇచ్చిన 10 సెకన్లలోనే సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది. దీనిపై విద్యాశాఖ అధికారులు, పోలీసుల నిర్లక్ష్యం బయటపడగా.. అధికారుల ప్రమేయంపై అనుమానాలు వచ్చాయి. అయితే మొబైల్ ఎగ్జామ్ సెంటర్‌లోకి ఎలా వెళ్లిందనే దానిపై ఆరా తీస్తున్నారు. వాట్సాప్ ద్వారా పేపర్ లీక్ కాగా, జీరాక్స్‌తో ఆన్సర్ షీట్స్ అందాయని ఆరోపణలు వస్తున్నాయి.