టెన్త్ ఫలితాలు.. 6 స్కూళ్లలో అందరూ ఫెయిల్

35717చూసినవారు
టెన్త్ ఫలితాలు.. 6 స్కూళ్లలో అందరూ ఫెయిల్
తెలంగాణ టెన్త్ ఫలితాలు ఇవాళ విడుదల కాగా 6 స్కూళ్లలో జీరో పాస్ పర్సంటేజ్ నమోదైనట్లు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. ఇందులో 4 ప్రైవేట్ స్కూళ్లు, 2 ఎయిడెడ్ స్కూళ్లు ఉన్నాయని.. ఒక్క ప్రభుత్వ పాఠశాల కూడా ఇందులో లేదని వెల్లడించారు. ఇక 3,927 స్కూళ్లలో 100శాతం ఉత్తీర్ణత నమోదైందని.. ఇందులో 1,347 జడ్పీ స్కూళ్లు ఉన్నాయన్నారు. ఇక 8,883 మంది విద్యార్థులు 10/10 జీపీఏ సాధించారని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్