బస్సుపై ఉగ్రదాడి..10 మంది మృతి

79చూసినవారు
బస్సుపై ఉగ్రదాడి..10 మంది మృతి
జమ్మూకశ్మీర్‌లో ఆదివారం సాయంత్రం ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 10 మంది మృతి చెందగా, 30 మందికిపైగా గాయపడ్డారు. జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలో ఈ ఘటన జరిగింది. శివఖోడి ఆలయాన్ని సందర్శించేందుకు యాత్రికులతో వెళ్తున్న బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. గాయపడిన వారు నోయిడా-ఘజియాబాద్, ఇతర జిల్లాలకు చెందినవారని తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్