విద్యుదాఘాతంతో అన్నదమ్ములు మృతి

59చూసినవారు
విద్యుదాఘాతంతో అన్నదమ్ములు మృతి
ప్రకాశం జిల్లా గిద్దలూరు సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద సోమవారం విషాద ఘటన చోటు చేసుకుంది. వాహన సామగ్రి తీసుకొస్తుండగా ఇనుప రాడ్లకు విద్యుత్ తీగలు తగిలాయి. విదుద్యాఘాతంతో లోహిత్ (18), సాయికృష్ణ (16) అనే ఇద్దరు అన్నదమ్ములు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. దాంతో ఆ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :