భారత స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు సోమవారం రికార్డు స్థాయి లాభాల్లో ప్రారంభమయ్యాయి ఉదయం 9.15 గంటలకు సెన్సెక్స్ 373.15 పాయింట్లు పెరిగి 77,066.51 వద్ద, నిఫ్టీ 115.40 పాయింట్లు లాభపడి 23,405.60 వద్ద ఉన్నాయి. నిఫ్టీలో అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్ కార్ప్, బజాజ్ ఆటో, కోల్ ఇండియా, శ్రీరామ్ ఫైనాన్స్ లాభపడగా, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హిందాల్కో నష్టపోయాయి.