భారత్-పాక్ మ్యాచ్‌లో భద్రతా లోపం (వీడియో)

59చూసినవారు
టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా న్యూయార్క్‌లో ఆదివారం జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ సమయంలో భద్రతా లోపం బయటపడింది. భారత్-పాక్ మ్యాచ్‌పై దాడి చేయనున్నట్లు ఇటీవలే ISIS ప్రకటించింది. అయితే మ్యాచ్ జరుగుతుండగా స్టేడియం మీదుగా ఓ విమానం ప్రయాణించింది. ఆ విమానం నుంచి 'రిలీజ్ ఇమ్రాన్ ఖాన్' అనే పేరుతో బ్యానర్‌ కనిపించింది. కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ ఇలా జరగడంపై క్రికెటర్ల భద్రతపై ఆందోళన రేకెత్తుతోంది.

సంబంధిత పోస్ట్