కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఏరియా ఆస్పత్రిలో గర్భిణులు డాక్టర్లు లేక అవస్థలు పడుతున్నారు. ఆస్పత్రిలో ఉదయం 8 గంటల నుంచి మత్తు మందు ఇచ్చే డాక్టర్ లేక ఆరుగురు గర్భిణులు నొప్పులతో బాధపడుతున్నారు. మత్తు ఇచ్చే డాక్టర్ లేకపోవడంతో సిజేరియన్ ఆపరేషన్లు ఆగిపోయాయి. గాంధీ ఆసుపత్రిలో ఒకే నెలలో 16 మంది గర్భిణీ స్త్రీలు, 48 చిన్నారుల మృతి ఘటన సంచలనం సృష్టించినా.. ఆరోగ్య శాఖ తగు చర్యలు తీసుకోవట్లేదని గర్భిణుల కుటుంబ సభ్యులు చెబుతున్నారు.