TG: అసెంబ్లీలో 71కి చేరిన కాంగ్రెస్ బలం

53చూసినవారు
TG: అసెంబ్లీలో 71కి చేరిన కాంగ్రెస్ బలం
తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి బలం 71 సీట్లకు చేరింది. తాజాగా చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ లో చేరారు. గులాబీ పార్టీ నుంచి మొత్తం ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరినట్లయింది. దీంతో సభలో కాంగ్రెస్ కు 71 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా బీఆర్ఎస్ 32కు పడిపోయింది. కాగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 64. బీఆర్ఎస్ 39, BJP 8, MIM 7, CPI 1 సీటు గెలిచాయి.

సంబంధిత పోస్ట్