తెలంగాణలోని వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. రావులపల్లి-కొడంగల్ హైవేపై ఒక్కసారిగా నేమ్ బోర్డు హోర్డింగ్ కుప్పకూలింది. అక్కడ ఏ వాహనం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నడిరోడ్డుపై హోర్డింగ్ కుప్పకూలడంతో 3 కి.మీ. వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అటు HYDలోని బోరబండా, మాదాపూర్, నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతి నగర్, జూబ్లీహిల్స్, సుల్తాన్ పూర్, మల్లంపేట్, గండి మైసమ్మ పరిసర ప్రాంతాల్లో వర్షం పడింది.