TG: మల్టీపర్పస్ వర్కర్లకు రూ.139 కోట్లను విడుదల

83చూసినవారు
TG: మల్టీపర్పస్ వర్కర్లకు రూ.139 కోట్లను విడుదల
తెలంగాణలో మల్టీ పర్పస్ వర్కర్ల బకాయి పడ్డ వేతనాలను చెల్లిస్తున్నట్టు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ డైరెక్టర్ సృజన శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అయితే జీతాలను చెల్లించనున్నట్టు ఇదివరకే ప్రకటించగా అధికారికంగా రూ. 139 కోట్లను విడుదల చేసినట్లు తెలిపారు. కార్మికుల వేతనాల చెల్లింపుల కోసం టీఎస్ బీపాస్ ఖాతాకు సర్దుబాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శులకు చెక్కులు జారీ చేశామని తెలిపారు. గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలను చెల్లించనున్నట్టు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్