కామారెడ్డి జిల్లాలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన జరిగింది. 4, 6వ తరగతి చదువుతున్న బాలికలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. స్కూల్‌లో విద్యార్థినులు హేళన చేశారని మనస్తాపం చెందిన బాలికలు.. ఈ దుశ్చర్యకు పూనుకున్నారు. గమనించిన స్థానికులు.. బాలికలను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.