తెలంగాణలో ఫ్యూచర్ సిటీ పేరుతో దేశంలోనే ఒక గొప్ప నగరాన్ని నిర్మించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని CM రేవంత్ అన్నారు. న్యూయార్క్, లండన్, టోక్యో, సియోల్, దుబాయ్ లాంటి నగరాలతో పోటీ పడాలన్న ప్రభుత్వ ఆకాంక్షకు అనుగుణంగా పెట్టుబడులతో ముందుకు రావాలని పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానం పలికారు. HYDలోని గ్రీన్ బిజినెస్ సెంటర్‌లో జరిగిన భారత పరిశ్రమల సమాఖ్య జాతీయ కౌన్సిల్ సమావేశంలో పారిశ్రామికాభివృద్ధిలో ప్రభుత్వ లక్ష్యాలను సీఎం వివరించారు.