తాజ్‌ మహల్‌ హోటల్‌కు అసలైన అందం అదే

65చూసినవారు
తాజ్‌ మహల్‌ హోటల్‌కు అసలైన అందం అదే
రతన్ టాటా మూగజీవాలపై చూపే ప్రేమకు 'తాజ్ మహల్ హోటల్' ఓ నిదర్శనం. అక్కడ ఓ వీధి శునకం నిద్రపోవడాన్ని గమనించిన ప్రముఖ హెచ్ఆర్ నిపుణురాలు రూబీ ఖాన్ సిబ్బందితో మాట్లాడి రతన్ టాటా మానవత్వానికి ఫిదా అయ్యారు. శునకం పుట్టినప్పటి నుంచి అక్కడే పెరిగింది. హోటల్‌లో ఓ భాగమైపోయిందని సిబ్బంది తెలిపారు. ఆయన తన కార్యాలయంలోనూ వీధి శునకాలకు గది కేటాయించారు. వర్షాకాలంలో వాటికి షెల్టర్లు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్