రాజాసింగ్‌కు మరోసారి హత్య బెదిరింపులు

69చూసినవారు
రాజాసింగ్‌కు మరోసారి హత్య బెదిరింపులు
గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి హత్య బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆయన తన ట్విట్టర్‌లో బెదిరింపు కాల్స్ వచ్చిన ఫోన్ నంబర్ల స్క్రీన్ షాట్లను పోస్ట్ చేశారు. ఇది మొదటిసారి కాదని, గతంలో కూడా ఫిర్యాదు చేశానని తెలిపారు. అయినప్పటికీ పోలీసులకు తెలియజేయడం తన బాధ్యతగా భావిస్తున్నానని పేర్కొన్నారు. గతంలో కూడా రాజాసింగ్‌కు హత్య బెదిరింపులు వచ్చాయి.

సంబంధిత పోస్ట్